Thursday, September 25, 2014

చందమామ రావే.. జాబిల్లి రావే

చిత్రం :  సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, సుశీల, వసంత 


పల్లవి : 


ఉం... ఉం... ఉం
చందమామ రావే.. జాబిల్లి రావే
కొండెక్కి రావే.. గోగుపూలు తేవే
చందమామ రావే.. జాబిల్లి రావే
కొండెక్కి రావే.. గోగుపూలు తేవే


చందమామ రావే... జాబిల్లి రావే
 


చరణం 1 : 


చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములు పూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే


కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలోని గోగుపూలు తేవే


చందమామ రావే.. జాబిల్లి రావే
కొండెక్కి రావే.. గోగుపూలు తేవే
చందమామ రావే.. జాబిల్లి రావే 


చరణం 2 : 


మునిజన మానసమోహిని యోగిని.. బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని.. బృందావనం
మునిజన మానసమోహిని యోగిని.. బృందావనం
మురళీరవళికి ఆడిన నాగిని.. బృందావనం


రాధామాధవ గాథల రంజిలు బృందావనం

గోపాలుని మృదుపద మంజీరము బృందావనం

గోపాలుని మృదుపద మంజీరము... 

బృందావనం.. బృందావనం.. బృందావనం


హే.. కృష్ణా.. ముకుందా.. మురారీ
హే.. కృష్ణా.. ముకుందా..మురారీ.. కృష్ణా .. ముకుందా.. మురారీ
కృష్ణా.. ముకుందా.. మురారీ
జయ కృష్ణా.. ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ

చందమామ రావే.. జాబిల్లి రావే
కొండెక్కి రావే.. గోగుపూలు తేవే
చందమామ రావే.. జాబిల్లి రావే 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12042

No comments:

Post a Comment