Thursday, September 25, 2014

ఈ గాలి.. ఈ నేల

చిత్రం :  సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు 


పల్లవి : 


ఈ గాలి.. ఈ నేల.. ఈ ఊరు సెలయేరు
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
నను గన్న నా వాళ్ళు.. హా..ఆ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు


ఈ గాలి..ఈ.. ఈ నేల.. 


చరణం 1 : 


చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా.. నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా
చిన్నారి గొరవ౦కా కూసేను ఆవ౦కా.. నా రాక తెలిసాక వచ్చేను నా వ౦కా


ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఎన్నాళ్ళో గడిచాకా ఇన్నాళ్ళకు కలిసాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక.. ఎగసేను ని౦గి దాక
ఉప్పొ౦గిన గు౦డెల కేక.. ఎగసేను ని౦గి దాక

ఎగసేను.. నింగి దాక...ఆ..


ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను గన్న నా వాళ్ళు.. ఆ..ఆ..ఆ.. నా కళ్ళ లీగిళ్ళు
ఈ గాలి..ఈ.. ఈ నేల.. 


చరణం 2 : 


ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏనాడు ఏ శిల్పి..ఈ.. కన్నాడో ఈ కలను.. ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను


ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను


ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇటనాట్యాలాడేను 


చరణం 3 : 


కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కా౦తి చినుకులై


గగన గళము ను౦డి అమర గానవాహిని .. ఆ..ఆ..ఆ..
గగన గళము ను౦డి అమర గానవాహిని
జాలువారుతో౦ది ఇలా అమృతవర్షిణి..ఈ.. అమృతవర్షిణి..ఈ అమృతవర్షిణీ..
ఈ స్వాతివానలో నా ఆత్మస్నానమాడే
నీ మురళిలో నా హృదయమే.. స్వరములుగా మారే..

ఆహాహ ఆహ ఆహ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. ఈ ఊరు సెలయేరు
నను కన్న నా వాళ్ళు..ఊ.. నా కళ్ళ లోగిళ్ళు..ఊ..
ఈ గాలి..ఈ.. ఈ నేల..ఆ.. 



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12041

No comments:

Post a Comment