Tuesday, September 23, 2014

ఊరికే కొలను నీరు

చిత్రం :  సంపూర్ణ రామాయణం (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


ఊరికే కొలను నీరు.. ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది


ఎందుకో ఎందుకో ప్రతి పులుగు యేదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్ళు ఊగి ఊగి పోతుంది


చరణం 1 :


అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి
ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి
నా కన్నా నిరుపేద నా మహరాజు పాపం అదుగో


అసలే ఆనదు చూపు.. ఆ పై ఈ కన్నీరు
తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో
ఏలాగో.. నా రామా.. ఏదీ.. ఏదీ.. ఏదీ..
నీల మేఘమోహనము.. నీ మంగళ రూపము


చరణం 2 :


కొలను నడిగి తేటనీరు.. కొమ్మ నడగి పూల తేరు
గట్టు నడిగి.. చెట్టు నడిగి.. పట్టుకొచ్చిన ఫలాలు.. పుట్ట తేనె రసాలు


దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని
ముందుగా రవ్వంత చూసి విందుగా అందీయనా...
విందుగా అందీయనా



No comments:

Post a Comment