Wednesday, September 10, 2014

కన్నుల్లో నీ బొమ్మ చూడు

చిత్రం :  విమల (1960)
సంగీతం : సుబ్బయ్య నాయుడు
గీతరచయిత :  ముద్దుకృష్ణ
నేపధ్య గానం :  ఘంటసాల,  జయలక్ష్మి



పల్లవి :


కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...



చరణం 1 :


పున్నమ వెన్నెల వన్నెలలో....ఓ...ఓ.. ఆ...ఆ...
పున్నమ వెన్నెల వన్నెలలో... కన్నుల కట్టిన రూపముతో...
నీవే మనసున తోచగా... ఆ...ఆ...
నీవే మనసున తోచగా... నను నేనే మరిచిపోదురా...


కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...



చరణం 2 :


కోయిల పాటల తీరులతో... ఓ...ఓ...
కోయిల పాటల తీరులతో... సరిపోయిన రాగాలల్లుదమా...
సరిపోయిన రాగాలల్లుదమా...
నచ్చిన పూవు గద నేను...
నచ్చిన పూవు గద నేను.. కోరి వచ్చిన తుమ్మెద నీవేరా..


కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు


చరణం 3 :


రాగమాలికల వీణ నీవే.... ఏ..ఏ...ఏ..
రాగమాలికల వీణ నీవే... అనురాగములేలే జాణ నేనే..
అనురాగములేలే జాణ నేనే...


నీవే వలపుల జాబిలిరా... ఆ...ఆ..ఆ..
నీవే వలపుల జాబిలిరా... మరి నేనే కులుకుల వెన్నెలరా...


కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు... అది కమ్మని పాటలు పాడు
కన్నుల్లో నీ బొమ్మ చూడు...
నా కన్నుల్లో నీ బొమ్మ చూడు...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18561

No comments:

Post a Comment