Wednesday, September 24, 2014

అన్నానా? భామిని

చిత్రం :  సారంగధర (1957)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, లీల




పల్లవి : 


అతను :  అన్నానా? భామిని

ఆమె :  ఏమని?

అతను : ఎపుడైనా అన్నానా భామిని

ఆమె : ఏమని?


అతను : అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
             అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని
             మాటవరసకెపుడైనా అన్నానా భామిని! ఎపుడైనా


ఆమె : అన్నానా? మోహనా


అతను : ఏమని


ఆమె : ఎపుడైనా..ఆ..అన్నానా మోహనా


అతను : ఏమనీ


ఆమె : తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని


అతను : ఆహా


ఆమె : తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా! ఎపుడైనా
 


చరణం 1 : 


అతను : లోకానికి రాజునైనా.. నీ ప్రేమకు దాసుడనని


ఆమె : హ్మ్..హ్మ్


అతను : లోకానికి రాజునైనా.. నీ ప్రేమకు దాసుడనని
             మాటవరసకెపుడైనా.. అన్నానా? భామిని! ఎపుడైనా
 


చరణం 2 : 


ఆమె : నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
అతను : ఆహా
ఆమె : నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
          ఆదమరచి ఎపుడైనా.. అన్నానా? మోహనా.. ఎపుడైనా
          అన్నానా  మోహనా.. ఎపుడైనా
          ఆ..ఆ..ఆ..ఆ 



No comments:

Post a Comment