Sunday, September 21, 2014

నువ్వు లేక అనాథలం

చిత్రం :  శ్రీషిర్డి సాయిబాబా మహత్యం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


సాయిబాబా .. సాయిబాబా
సాయినాధా.. సాయి దేవా
సత్యం నిత్యం నీవే కావా


నువ్వు లేక అనాథలం...  బ్రతుకంతా అయోమయం
బాబా......ఓ.....బాబా
ఇక నీ పరీక్షకు మేమాగలేము
ఇటులీ నిరీక్షణ మేమోపలేము 

నువ్వు లేక అనాథలం...  బ్రతుకంతా అయోమయం
బాబా......ఓ.....బాబా


చరణం 1 :


మా పాలి దైవమని మా దిక్కు నీవేనని
కొలిచాము దినం దినం సాయి...
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని
వేచాము క్షణం క్షణం సాయీ....
శ్రీరాముడైనా......శ్రీకృష్ణుడైనా...
ఏ దైవమైనా.....ఏ ధర్మమైనా...
నీలోనే చూచాము సాయీ....
రావా........బాబా.....రావా....
రక్షా......దక్షా....నీవే కదా మా బాబా... 

నువ్వు లేక అనాథలం...  బ్రతుకంతా అయోమయం
బాబా......ఓ.....బాబా

చరణం 2 :


మా ఏసు నీవేనని మా ప్రభువూ నీవేనని
ప్రార్థనలు చేశామయా నిన్నే....
అల్లాగా వచ్చావని చల్లంగా చూస్తావని
చేశాము సలాం సలాం నీకే
గురునానకైనా....గురు గోవిందైనా...
గురుద్వారమైనా...నీ ద్వారకేననీ
నీ భక్తులైనాము సాయీ...
రావా........బాబా.....రావా....
రక్షా......దక్షా....నీవే కదా మా బాబా...


నువ్వు లేక అనాథలం...  బ్రతుకంతా అయోమయం
బాబా......ఓ.....బాబా

చరణం 3 :


కృష్ణసాయి కృష్ణసాయి రామసాయి
అల్లాసాయి మౌలా సాయి
నానక్ సాయి గోవింద్ సాయి
ఏసు సాయి షిర్డిసాయి ఓం....
సాయి సాయి బాబా సాయీ
సాయి సాయి బాబా సాయీ
సాయి సాయి బాబా సాయీ
సాయి సాయి బాబా సాయీ... ఓం

No comments:

Post a Comment