Thursday, September 25, 2014

వెండి వెన్నెల జాబిలి

చిత్రం :  సిరి సంపదలు (1962)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, జానకి
 



పల్లవి :



ఈ పగలు రేయిగా.. పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ...  ఆ... ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి... ఓ... ఓ... ఓ... 


చరణం 1 :


మనసున తొణికే చిరునవ్వెందుకు...పెదవుల మీదికి రానీవు?

అహా... ఓహో... అహా... ఆ... ఆ...

మనసున తొణికే చిరునవ్వెందుకు... పెదవుల మీదికి రానీవు?

పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు.. ఊఁ.... 

  

వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి... 

ఆ... ఆ...ఆ... ఆ... ఓ... ఓ... ఓ...


చరణం 2 :


కన్నులు తెలిపే కథలనెందుకు.. రెప్పలార్చి ఏమార్చేవు?
ఆఁ... ఆఁ... ఓ.. ఓ... ఓ...
కన్నులు తెలిపే కథలనెందుకు.. రెప్పలార్చి ఏమార్చేవు?
చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో...


వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి... 

చరణం 3 :


అలుక చూపి అటువైపు తిరిగితే.. అగుపడదనుకుని నవ్వేవు
ఉహుహు..
అలుక చూపి అటువైపు తిరిగితే.. అగుపడదనుకుని నవ్వేవు
నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను.. ఆహా...


వెండివెన్నెల జాబిలి.. నిండు పున్నమి జాబిలి..
ఆహహాహా... ఆహహాహా...
ఆహహాహా... ఆహహాహా...
ఊహుహూ...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1590

No comments:

Post a Comment