చిత్రం : సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : దేవులపల్లి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
ఓ హో ... హో
ఆ నావ దాటిపోయింది.. ఆ ఒడ్డే చేరీ పొయింది
అట్లాగే మళ్ళీ పోయెనా ... నాన్నిడిచి వెళ్ళీపోయేనా
నాన్నిడిచి వెళ్ళీపోయేనా...
ఓ హో... హో
ఆ నావ దాటిపోయింది.. ఆ ఒడ్డే చేరీ పొయింది
అట్లాగే మళ్ళీ పోయెనా ... నాన్నిడిచి వెళ్ళీపోయేనా
నాన్నిడిచి వెళ్ళీపోయేనా...
ఓ హో... హో... ఓ.....
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను
నిశిరాతిరి అయినా నీ పిలుపే .. నా ప్రియా
అదే పూలగాలి... ఆ నాటిదే జాబిలి
ఏదీ ఎదుట మసిలీ.. ఏదీ లేదు నా చెలి
ఏదీ లేదు నా చెలి
అహహా.. ఆ... ఆ...
నా నావ పగిలేపోయింది.. నా రేవు వేరై పోయింది
నా ఇల్లు మారీపోయింది.. నాకన్నే మాత్రం మిగిలింది...
నా కన్నే నాలో మిగిలింది
చరణం 1 :
ఓ హో .. ఓ
నా కోసం పిలిచావో.. అపుడెంత కలవరించావో..
నా కోసం పిలిచావో.. అపుడెంత కలవరించావో..
ఆ రూపే సోకేను.. అదే గుండె కాల్చేను
ఇదే హోరు గాలి .. ఇదే పొంగు కడలి ..ఇదే మసక జాబిలి
ఏడీ లేడు .. నా మావ .... ఏడీ లేడు....
ఆహా హా .. నానావే పగిలిపోయింది... నా రేవు వేరై పోయింది
అట్లాగే మళ్ళీ పోయేనా... నన్నిడిచి వెళ్ళేపోయేనా
నన్నిడిచి వెళ్ళే పోయేనా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1666
No comments:
Post a Comment