Sunday, September 28, 2014

పలికినది... పిలిచినది

చిత్రం :  సీతారాములు (1980)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  బాలు,  సుశీల
  


సాకీ :


వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి
సురుచిర బంభరవేణి సురనుత కల్యాణి
నిరుపమ శుభగుణలోల నిరతజయాప్రదశీల
వరదాప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి
సరసీజాసన జనని.. జయ జయ జయ...



పల్లవి :



పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహనరాగం


పలికినది... పిలిచినది ...
పరవశమై నవమోహన రాగం
పలికినది ....పిలిచినది.. 


చరణం 1 :


గగనాంగనాలింగనోత్సాహియై... 

జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై

గగనాంగనాలింగనోత్సాహియై ...

జగమెల్ల పులకించె సుమగుచ్ఛమై..

మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...

మమతలు అల్లిన పెళ్ళిపందిరై ...

మనసులు వీచిన ప్రేమ గంధమై ....

పలికినది... పిలిచినది.. 

పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది.. 


చరణం 2  :



గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై

గంగా తరంగాల సంగీతమై... కమణీయ రమణీయ యువగీతమై


కలిమికి లేమికి తొలి వివాహమై...కలిమికి లేమికి తొలి వివాహమై..

యువతకు నవతకు రసప్రవాహమై...

పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది.. 



చరణం 3 :


మలయాద్రి పవనాల ఆలాపనై ...మధుమాస యామిని ఉద్దీపనై ...

మలయాద్రి పవనాల ఆలాపనై ...మధుమాస యామిని ఉద్దీ పనై...

అనురాగానికి ఆది తాళమై..అనురాగానికి ఆది తాళమై ...ఆనందానికి అమర నాదమై...

పలికినది పిలిచినది... పరవశమై నవమోహనరాగం

పలికినది పిలిచినది..



No comments:

Post a Comment