Friday, September 19, 2014

పంచమి పూట మంచిదని

చిత్రం  :  శ్రీరంగ నీతులు (1983)
సంగీతం  :  చక్రవర్తి  
గీతరచయిత  :   ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల    
 



పల్లవి :


పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
వచ్చే  వారం ముచ్చటని రాసిచ్చాను ఎద చాటు
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది

అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో..



అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
ఊపిరి నీవే అన్నాడని మనసిచ్చాను గ్రహపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది 

అయ్యో అయ్యో అయ్యో అయ్యో అయ్యో... 


పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచొడని చనువిచ్చాను పొరపాటు


చరణం 1 :



కళ్ళలోకి చూస్తే సంకేళ్ళు వేసేస్తావు
నీ పైట చాటుకు వస్తే చాపల్లే చుట్టేస్తావు 


కలలోకి రావదన్నా వస్తావు రేయంతా
నీ ప్రేమ ముద్దరలన్ని వేస్తావు ఒల్లంతా  


సరదాలే ఈ వేళ సరిగమలే పాడాయి
ఆ మాటే అన్నావు చాలింక.. నీ మొజే మళ్ళింది నా వంక
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో...


పంచమి పూట మంచిదని మాటిచ్చను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
 


చరణం 2 :


ఎదురుగ ఉన్నా గాని ఎదలోకి రమ్మన్నానా?
ఎగతాళికన్న గాని నను దొచుకోమన్నానా ?

వగలన్ని చూస్తూ ఉంటే  వయసూరుకుంటుందా?
కనుసైగ చేస్తూ ఉంటే  వలపాపుకుంటుందా
 ?  


సరికొత్త గుబులేదో గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలి... నీ చెంతే బ్రతుకంతా సాగాలీ
అయ్యొ అయొ అయొ అయ్యొ అయ్యో.... 


అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
ఆ చనువే నా కొంప ముంచింది.. ఆ మనసే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచింది  ఆ రాతే నా దుంప తెంచింది


పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
అయ్యొ పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు


No comments:

Post a Comment