Saturday, September 27, 2014

మావి చిగురు తినగానే

చిత్రం :  సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  బాలు, సుశీల
పల్లవి :


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా...
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని..


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ..కోయిల పలికేనా  చరణం 1 :తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా... తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా ..సయ్యాటలా.. సయ్యాటలా.. తారాటలా


వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు... బిడియాలు..
పొంకాలు... పోడుములు..
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి.. గడసరి...


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనాచరణం 2 :ఒకరి ఒళ్ళు ఉయ్యాలా.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాలా.. జంపాల.. జంపాల.. ఉయ్యాలా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా... వేరొకరి గుండె జంపాల


ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..


పలకరింతలో... పులకరింతలో...
పలకరింతలో... పులకరింతలో..
ఏమో ఏమగునో గాని ఈ కత.. మన కత..మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని...


మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనా...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4834

No comments:

Post a Comment