Tuesday, October 14, 2014

అందెల రవమిది పదములదా

చిత్రం : స్వర్ణ కమలం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : సిరివెన్నెల

నేపధ్య గానం : బాలు,  వాణీ జయరాం


పల్లవి :
గురు బ్రహ్మః ...  గురు విష్ణుః.. గురుదేవో మహేశ్వరః

గురుసాక్షాత్ పరబ్రహ్మః... ఆ.. ఆ

గురు సాక్షాత్ పరబ్రహ్మః...  ఆ... ఆ

తస్మై శ్రీ గురవే నమ: 

 

అతడు :


ఓం నమో నమో నమశ్శివాయ


ఆమె :


మంగళప్రదాయగోతు రంగతే నమః శివాయ

గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ


అతడు :


ఓం నమో నమో నమశ్శివాయ


ఆమె :


శూలినే నమో నమః కపాలినే నమః శివాయ

పాలినే విరంచితుండ మాలినే నమః శివాయ


ఆమె :

అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ

అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?

అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?

అమృత గానమిది పెదవులదా?... అమితానందపు ఎద సడిదా?


అతడు :


సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగా యాగ ఫలముగా

సాగిన సాధన సార్ధకమందగ.. యోగ బలముగా యాగ ఫలముగా

బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా...

 

 

ఆమె :

అందెల రవమిది పదములదా?... ఆ.. ఆచరణం 1 :

ఆమె :


మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై

 మువ్వలు ఉరుముల సవ్వడులై... మెలికలు మెరుపుల మెలకువలై

మేను హర్ష వర్ష మేఘమై... ఆ.. ఆ... 

వేణి విసురు వాయు వేగమై... ఆ... ఆ

 

అతడు :

అంగ భంగిమలు గంగ పొంగులై

హావభావములు నింగి రంగులై

లాస్యం సాగే లీల.. రస ఝరులు జాలువారేలా

 

ఆమె :

జంగమమై జడమాడగా

 

అతడు :

జలపాత గీతముల తోడుగా

 

ఆమె,  అతడు :

పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా

 

ఆమె :

 

అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ...

 

 


చరణం 2 :

అతడు :


నయన తేజమే...  నకారమై

మనో నిశ్చయం... మకారమై

శ్వాస చలనమే... శికారమై

వాంచితార్ధమే... వకారమై

యోచన సకలము... యకారమై


నాదం... నకారం... 

మంత్రం... మకారం..
స్తోత్రం... శికారం... 

వేదం... వకారం..

యజ్ఞం... యకారం...

ఓం నమశ్శివాయ...

 

ఆమె :


భావమె భవునకు భావ్యము కాగా

భరతమె నిరతము భాగ్యము కాగా

 

 

అతడు :

తుహిన గిరులు కరిగేలా... తాండవమాడే వేళా

 

ఆమె :

ప్రాణ పంచమమె పంచాక్షరిగా.. పరమపధము ప్రకటించగా

అతడు :


ఖగోళాలు పద కింకిణులై .. పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా


ఆమె :

అందెల రవమిది పదములదా?... అంబరమంటిన హృదయముదా?

అమృత గానమిది పెదవులదా?... అమితానందపు ఎద సడిదా?

అందెల రవమిది పదములదా?... ఆ.. ఆ

No comments:

Post a Comment