Wednesday, October 8, 2014

మొరటోడు నా మొగుడు

చిత్రం  :  సెక్రెటరి (1976)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  :  రామకృష్ణ,  సుశీలపల్లవి :


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు


జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా... 
డడడడ డడడడ డడడడడా


మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు


జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు చరణం 1 :


తెచ్చానే మల్లెదండా...
తురిమానే జడ నిండా
చూసుకోవె నా వలపు వాడకుండా...


నా మనసే నిండుకుండా...
అది ఉంటుంది తొణక్కుండా
నీ వలపే దానికి అండదండ...
డడడడ డడడడ డడడడడా
డడడడ డడడడ డడడడడా


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు  
చరణం 2 :


నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...నిలబడి చూసుకుంటానందాలూ
నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...నిలబడి చూసుకుంటానందాలూ
విల్లంటి కనుబొమలు.. విసిరేను బాణాలు...విరిగిపోవునేమొ నీ అద్దాలు
డడడడ డడడడ డడడడడా... డడడడ డడడడ డడడడడామొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు చరణం 3 :తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ..
దిద్దుతానె ముద్దులతో పారాణులూ
నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ..
ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ
డడడడ డడడడ డడడడడా
డడడడ డడడడ డడడడడా


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...
మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు
జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..
ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు
డడడడ డడడడ డడడడడా...  
డడడడ డడడడ డడడడడా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1760

No comments:

Post a Comment