Monday, October 27, 2014

నా మనసే ఒక తెల్లని కాగితం

చిత్రం :  అర్ధాంగి (1977)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల 




పల్లవి :


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం


అది ఈనాడైనా ఏనాడైనా.. నీకే నీకే అంకితం.. 

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం


చరణం 1 :


తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే  


కనులే కలలై.. కలలే కనులై
కనులే కలలై.. కలలే కనులై
చూసిన అందాలు అనుబంధాలు.. అవి నీకే నీకే అంకితం 


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం



చరణం 2 :


నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే

ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
పలికిన రాగాలు అనురాగాలు.. అవి నీకే నీకే అంకితం  


నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5326

No comments:

Post a Comment