Thursday, October 16, 2014

శృతి నీవు గతి నీవు

చిత్రం : స్వాతికిరణం (1992)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :   చిత్ర, వాణీజయరాం 

పల్లవి :

శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి

ఈ నా కృతి నీవు భారతి.. ఈ నా కృతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి

దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి

దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి..

శరణాగతి నీవు భారతి ...

చరణం 1 :

నీ పదములొత్తిన పదము.. ఈ పదము నిత్య కైవల్య పధము

నీ కొలువు కోరిన తనువు.. ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవు

కోరిన మిగిలిన కోరికేమి?.. నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప

చేరినా ఇక చేరువున్నదేమి?.. నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప 

శృతి నీవు గతి నీవు.. ఈ నా కృతి నీవు భారతి

 దృతి నీవు ద్యుతి నీవు.. శరణాగతి నీవు భారతి

చరణం 2 :

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే

శ్రీనాధ కవినాధ శృంగార కవితా తరంగాలు నీ స్ఫూర్తులే

అల అన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే

త్యాగయ్య గళ సీమ రాజిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే

ఈ కరుణ నెలకున్న ప్రతి రచనం... జననీ భవ తారక మంత్రాక్షరం 

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి
దృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=12427

No comments:

Post a Comment