Sunday, October 26, 2014

ఏ ఊరు..ఏ వాడ

చిత్రం  :  హేమా హేమీలు (1979)
సంగీతం  :  రమేశ్ నాయుడు
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల  
 


పల్లవి :


ఏ ఊరు?... నీదే ఊరు?
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ


ఆకాశంలో ఉన్న చందమామని
నీ కోసం దిగివచ్చిన మేనమామని
ఆకాశంలో ఉన్న చందమామనీ
నీ కోసం దిగివచ్చిన మేనమామనీ
వరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా

ఏ ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ


లు లు లూ..లు లు లూ..
హా..హే..లు లు లూ..
హా..హా..లు లు లు.. 


చరణం 1 :


నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నాపేన చంద్రహారం నీకు చేయిస్తా
ఏమిస్తావూ? ఊ..ఊహూఊ..నన్నేం చేస్తావు?మీ ఊళ్ళో చుక్కలు దులిపి... మా ఊళ్ళో గుక్కలు తడిపి
మీ ఊల్లో చుక్కలు దులిపి... మా ఊల్లో గుక్కలు తడిపి
ప్రేమిస్తే.. పెగ్గుకటి ఇస్తా..  ముద్దొస్తే.... ముద్దర వేస్తా..


పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..
పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..


ఏ..ఊరు..నీదే ఊరు..
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ


లు లు లూ.. లులుల్లూ లు లు లూ
లు లు లూ..లులుల్లూ లు లు లూ
హా..హే..ఆ..హే..లు లు లూ... చరణం 2 :


మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
అందాల ఆగ్రహారం నీకు రాసిస్తా..
ఏం చేస్తావో? ఉహు..హూ..హూ.... నన్నేం చేస్తావో?


నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
గెలిపిస్తే... ఉరుమై వస్తా..జడిపిస్తే... పిడుగైపోతా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా


ఏ..ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3678

No comments:

Post a Comment