Tuesday, October 28, 2014

ఆడదాని ఓరచూపుతో

చిత్రం :  ఆరాధన (1962)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
నేపధ్య గానం :  జానకి    

పల్లవి :

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ 

చరణం 1 :

మిఠారి నవ్వులే మిఠాయి తీపులు.. కటారి రూపులోన కైపులున్నవి
రంగేళి ఆటకు రడీగా ఉన్నది
రంగేళి ఆటకు రడీగా ఉన్నది...  కంగారు ఎందుకోయీ 

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

చరణం 2 :

ఖరీదు లేనివి ఖరారు అయినవి...  గులాబి బుగ్గలందు సిగ్గులున్నవి

మజాల సొగసులే ప్రజెంట్ చేసెద..
మజాల సొగసులే ప్రజెంట్ చేసెద...  సుఖాల తేలవొయీ

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్
నిజానికి జిగేలని వయారి నిన్నుచూడ కరిగిపోదువోయ్ 

ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వరోయ్

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6336

1 comment: