Tuesday, November 11, 2014

ఆహా ఏమి రుచి



చిత్రం :  ఎగిరే పావురమా (1997)
సంగీతం  :  ఎస్.వి. కృష్ణారెడ్డి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర



పల్లవి :


ఆ... ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ...
ఇంకా చెప్పాలా వంకాయేనండీ


ఆహా ఏమి రుచి అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ .. మోజే తీరనిదీ



చరణం 1 :


అల్లం పచ్చిమిర్చీ శుచిగా నూరుకునీ...ఈ...
ఆ......
దానికి కొత్తిమీరీ బాగా తగిలిస్తే
గుత్తొంకాయ కర్రీ ఆకలి పెంచుకదా
అది నా చేతుల్లో అమృతమే అవదా
ఒండుతూ ఉంటేనే రాదా.. ఘుమఘుమ ఘుమఘుమ ఘుమఘుమలు


ఆహా ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ



చరణం 2 :


లేత వంకాయలతో వేపుడు చేసేదా...
మపద...దనిసరి రిగరిగగరిస...నిసగప...
మెట్టవంకాయలతో చట్నీ చేసేదా
టొమెటో కలిపి వండిపెడితే మీరు
అన్నమంత వదిలేసి ఒట్టి కూర తింటారు
ఒకటా రెండా మరి వంకాయ లీలలు తెలియగ తెలుపగ తరమా


ఆహా... ఏమి రుచి ...అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ... మోజే తీరనిదీ
తాజా కూరలలో... రాజా ఎవరండీ
ఇంకా చెప్పాలా... వంకాయేనండీ
ఆ.....


No comments:

Post a Comment