Thursday, November 20, 2014

నోము పండించవా స్వామీ

చిత్రం :  నోము (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల 



పల్లవి :


నోము పండించవా స్వామీ.. నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా..  నిను కొలిచితిరా.. అలక చాలించి పాలించవా


నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా.. నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా.. నోము పండించవా స్వామీ
 




చరణం 1 :


అనురాగ మొలికే అందాల రాజుకు ఇల్లాలుగా చేసినావు
ఏ వేళనైనా యే ఆపదైనా మమ్మెంతో కాపాడినావు
ఎడబాటు యెరుగని మా జంట నిపుడు
ఎడబాటు ఎరుగని మా జంట నిపుడు  
ఎందుకు విడదీసినావు.. నీవూ ఎందుకు విడదీసినావు


నోము పండించవా స్వామీ నన్ను కరుణించ రావేమీ
నిను నమ్మితిరా..  నిను కొలిచితిరా..
అలక చాలించి పాలించవా..  నోము పండించవా స్వామీ
 


చరణం 2 :



ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
ఆదిశేషుని అవతారం నీవైతే.. నేనింత కాలము నోచిన నోము నిజమైతే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
దైవంగా నా పతినే నేను పూజిస్తే
నీ మహిమను చూపాలీ.. మా కాపురం నిలపాలీ
నిజం నిరూపించాలీ రావా .. దేవా !! రావా ! దేవా !! 


No comments:

Post a Comment