Monday, November 3, 2014

భలే ఛాన్స్ లే

చిత్రం :  ఇల్లరికం (1959)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  మాధవపెద్ది సత్యం 


పల్లవి : 


ఛాన్స్ భలే ఛాన్స్..
భలే ఛాన్స్ లే భ లే ఛాన్స్ లే
లలలాం లలలాం లక్కీ చాన్స్ లే
భలే చాన్స్ లే
ఇల్లరికంలో వున్నమాజా...
ఇల్లరికంలో వున్న మజా
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే 


చరణం 1 :


అత్తమామలకు ఒక్క కూతురౌ...అదృష్ట యొగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ...అదృష్ట యొగం పడితే
బావమరుదులే లేకుంటే...ఇంటల్లుడిదేలే అధికారం
భలే చన్స్ లే


గంజిపోసినా అమృతంలాగా...కమ్మగవుందనుకొంటే
బహు కమ్మగవుందంకొంటే
ఛీ...ఛా...ఛీ... ఛా యన్నా
చిరాకు పడక దులపరించుకొని...పొయ్యేవాడికి
భలే ఛాన్స్ లే
ఇల్లరికంలో వున్నమజా...
ఇల్లరికంలో వున్నమజా...
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే... 


చరణం 2 :


జుట్టుపట్టుకొని బైటికీడ్చినా..చూరుపట్టుకొని వేలాడీ..ఈ...ఈ...
జుట్టుపట్టుకొని భైటి కీడ్చినా...చూరుపట్టుకొని వేలాడీ
దుషణ భూషణ తిరస్కారములు...ఆశీసులుగా తలచేవాడికి
భలే ఛాన్స్ లే...అహా..అహా..
భలే ఛాన్స్ లే...
భలే ఛాన్స్ లే భలే ఛాన్స్ లే
లలలాం లలలాం లక్కీ ఛాన్స్ లే
భలే ఛాన్స్ లే


ఇల్లరికంలో వున్నమజా...
ఇల్లరికంలో వున్నమజా ..
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే.... 



చరణం 3 : 



అణిగీ మణిగీ వున్నామంటే...అంతా మనకే చిక్కేది
అణిగీ మణిగీ వున్నామంటే...అంతా మనకే చిక్కేది
మామ లోభి అయి కూడబెట్టితే...మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది...
ఇహ మనకే కాదా దక్కేది...
అది మనకే ...ఇహ మనకే అది మనకే
మనకే మనకే మనకే...
మ మ మ మనకే...


No comments:

Post a Comment