Monday, November 10, 2014

తాకిడిలో తహతహలు

చిత్రం  :  ఊరికి సోగ్గాడు  (1985)
సంగీతం  :  చక్రవర్తి
గీతరచయిత  :  సినారె 
నేపధ్య గానం  :  బాలు,  జానకి



పల్లవి : 



తకగానే... ల..ల..ల...ల.. అహాహహ.. అహ..ఆ..ఆ...


తాకిడిలో తహతహలు.. తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే.. పరవశమై.. పరిమళమై..ఒహొ..హో..

తకగానే తళతళలు... తనువంతా ప్రియలయలు...
పరువములో ప్రణయముతో పరిచయమే... పరిమళమై..
తాకిడిలో తహతహలు... తనువంతా ప్రియలయలు...


చరణం 1 :


ఆ చూపు సోకి.. అందాలు రేగే.. దాచలేను నేను దగ్గరైతే చాలు..
ఆ నవ్వు చూసి.. మందార పూసే.. తుమ్మెదల్లే నేను ఎట్ట వాలిపోను?


నా ఈడు చూసి సూరీడు కందే
నీ కన్నె తోడు ఇన్నాళ్ల కందే
ఎన్ని వింతలో.. తొలి కౌగిలింతలు..
తెలిసెనులే మనసుపడె వయసులలో.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


తాకిడిలో తహతహలు... తనువంతా ప్రియలయలు...



చరణం 2 :



వేసంగిలాగా వేడెక్కిపోయే.. రేపు మాపులన్నీ జంట కట్టుకుంటా
కార్తీకమల్లే కౌగిల్ల నిండే.. వెన్నెలంతనేగా వెచ్చ బెట్టుకుంటా


నీ కొంగు చూసి.. నా మేను పొంగే
నా కంటి పాప కడవళ్లు నవ్వే
ఎన్ని సిగ్గులో నును లేత బుగ్గలో
మెరిసినవి విరిసిన ఈ కౌగిలిలో... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



తకగానే తళతళలు... తనువంతా ప్రియలయలు...
పరువములో ప్రణయముతో పరిచయమే... పరిమళమై..హొయ్ హొయ్

తాకిడిలో తహతహలు... తనువంతా ఘుమఘుమలు
పరువముతో పరిచయమే.. పరవశమై.. పరిమళమై..ఒహొ..హో..

తకగానే తళతళలు... తనువంతా ఘుమఘుమలు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2701

No comments:

Post a Comment