Monday, December 1, 2014

చూడకు.. అలా చూడకు

చిత్రం :  విశాలి (1973)
సంగీతం : పుహళేంది
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల



పల్లవి : 


ఆ.. అహ.. హా..
చూడకు..  అలా చూడకు.. కళ్ళల్లోకి చూడకు
చూసి నను పిచ్చిదాన్ని చేయకు
అహ.. హా..చూసి నను పిచ్చిదాన్ని చేయకు


ఆ.. అహ.. హా..
చూడకు.. అలా చూడకు.. కళ్ళల్లోకి చూడకు
చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు
అహ.. హా.. చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు 


చరణం 1 :



చూపులకు ఓపలేని చిగురాకు సొగసు నాది.. హ.. హా
సొగసంతా ఒకేసారి  జుర్రుకునే వయసు నీది
పువ్వల్లే నవ్వులు రువ్వీ  బులిపించే బిగువే నీదీ
కవ్విస్తే ఊరుకోని కచ్చిపోతు మనసే నాది 


అహ.. హా.. అహ.. హా..
చూడకు .. అలా చూడకు.. కళ్ళల్లోకి చూడకు
చూసి నను పిచ్చిదాన్ని చేయకు
చూసి నను పిచ్చివాణ్ణి చేయకు
అహ.. హా.. చూసి నన్ను పిచ్చిదాన్ని చేయకు 



చరణం 2 :


ముద్దులన్నీ దాచుకున్నా.. మోవి నీకై పులకించిందీ.. అహ.. హా
హద్దులన్నీ చెరిపివేసీ.. ఆడతనం చెలరేగిందీ
ఇద్దరికీ ఈ లోకం సద్దుమనిగిపోయిందీ
పొద్దున్నే బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటుందీ
   

   

అహ.. హా... అహ.. హా..
చూడకు.. అలా చూడకు.. కళ్ళల్లోకి చూడకు
చూసి నను పిచ్చిదాన్ని చేయకు
అహ.. హా... చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు
చూసి నన్ను పిచ్చివాణ్ణి చేయకు
అహ.. హా... లలలల్లలలాల.. .. లలలల్లలలాల..
ఆ.. అహ.. హా.. అహహహహహాహా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4090



No comments:

Post a Comment