చిత్రం: వయసొచ్చిన పిల్ల (1975)
సంగీతం: టి. చలపతిరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
వయసొచ్చిన పిల్లకు ఆన్నిటి కంటే..
వలపే అందము.. వలపే అందమూ
చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
చరణం 1 :
కొమ్మకు పువ్వులందము.. పూలకు తావులందమూ
రేయికి చుక్కలందము.. చుక్కలకు చంద్రుడందమూ
రేయికి చుక్కలందము.. చుక్కలకు చంద్రుడందమూ
నీ నల్లని సిగలో తెల్లని మల్లెలు తళుకే అందము.. తళుకే అందమూ
చేతికి గాజులందము... చెంపకు సిగ్గులందమూ
చరణం 2 :
పాటకు రాగమందము.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ
పాటకు రాగమందము.. ఆటకు తాళమందమూ
కళ్లకు కాటుకందము.. కాళ్లకు గజ్జలందమూ
కళ్లకు కాటుకందము.. కాళ్లకు గజ్జలందమూ
నీ వెచ్చని కౌగిట ఊయలలూగే.. బ్రతుకే అందము.. బ్రతుకే అందమూ
చేతికి గాజులందము చెంపకు సిగ్గులందమూ
చరణం 3 :
నింగికి మబ్బులందము.. మబ్బుకు మెరుపులందమూ
మోముకు తిలకమందము.. పెదవికి నవ్వులందమూ
మోముకు తిలకమందము.. పెదవికి నవ్వులందమూ
నీ నీడను తోడును కోరే.. నాకు నీవే అందము.. నీవే అందమూ
చేతికి గాజులందము.. చెంపకు సిగ్గులందమూ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7930
No comments:
Post a Comment