Monday, December 8, 2014

చిట్టి పొట్టి బొమ్మలు

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల, జిక్కి  
 పల్లవి :

చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి . . . 

చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు 
చరణం 1 : కొంగులు ముడి వేసీ కోర్కెలు పెన వేసీ
బుగ్గలపై సిగ్గుతో కన్నులలో వలపుతో..
అడుగులలో మడుగులతో నడిచిపోవు బొమ్మలు..    

చిట్టి పొట్టి బొమ్మలు..  చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు..  చిన్నారీ బొమ్మలు 

చరణం 2 :మెరిసిపోవు తాళితో మెడలో పూమాలతో మేళాలూ.. 

తాళాలూ సన్నాయీ.. బాజాలూ

లాలలలాల......లాలలలాల

రాజు వెంట రాణీ కాళ్ళకు పారాణీ 

చేయి చేయి కలుపుకొని చిందులేయు బొమ్మలు . . .  

చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు .. చిన్నారీ బొమ్మలు చరణం 3 :
పూల పల్లకీలో ఊరేగే వేళలో
కూ.. కోయిలమ్మ పాటతో.. చిలకమ్మల ఆటతో
అంతులేని ఆశలతో గంతులేయు బొమ్మలు . . .

చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు..
చిట్టి పొట్టి బొమ్మలు.. చిన్నారీ బొమ్మలు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
బుల్లిబుల్లి రాధకు.. ముద్దు ముద్దు రాజుకు
పెళ్లండి.. పెళ్ళి ముచ్చటైన పెళ్ళి.. బహు ముచ్చటైన పెళ్ళి
No comments:

Post a Comment