Monday, December 29, 2014

తల్లీ తండ్రీ నీవేనమ్మా

చిత్రం :  భక్త కన్నప్ప (1976)
సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల



పల్లవి :



తల్లీ తండ్రీ నీవేనమ్మా.. చల్లని తల్లీ గౌరమ్మా  
తల్లీ తండ్రీ నీవేనమ్మా.. చల్లని తల్లీ గౌరమ్మా
    



చరణం 1 :


అమ్మలగన్న అమ్మవు నీవు.. ముజ్జగాలకే ముత్తయిదువవు
నిత్యసుమంగళి నీవేనమ్మా.. నిత్యసుమంగళి నీవేనమ్మా
నీ తలపే శుభమంగళమమ్మా 


తల్లీ తండ్రీ నీవేనమ్మా.. చల్లని తల్లీ గౌరమ్మా  



చరణం 2 :


కలవని కొలచినా శిలవని తలచినా.. తలపేదైనా దైవము నీవే
వెన్నేకానని కన్నులు మావి.. వెలుగు నీయవే మంగళ గౌరీ 


 
తల్లీ తండ్రీ నీవేనమ్మా.. చల్లని తల్లీ గౌరమ్మా   



చరణం 3 :


దీనజనావని పతితపావనీ.. దిక్కు చూపవే తల్లీ
నేరక చేసిన నేరాలెంచక.. దరిజేర్చు కల్పవల్లీ
మమ్ముగావమని మహాదేవునికి మనవి చేయవే దేవీ
శంకరీ.. శివశంకరీ.. అభయంకరీ.. అమ్మా.. ఈశ్వరీ 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4057

No comments:

Post a Comment