చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : జానకి
పల్లవి :
శివ శివ అననేలరా..
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాస మందగా..
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా
చరణం 1 :
కొందరికేమో జన్మకో శివరాత్రి... ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
కొందరికేమో జన్మకో శివరాత్రి... ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి
భక్తులకు బ్రతుకు గడుపగా.. గడుపగా.. ముక్తి
మనబోటి రక్తులకు.. సనిద నిదప గా మా పా
మనబోటి రక్తులకు.. సగమా గమద మనిద మదప
మనబోటి రక్తులకు... ఘడియ ఘడియకు.. ముక్తీ . . శివ . . శివ
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాస మందగా..
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా ... రా.. రా
చరణం 2 :
టక్కరి మరుని ఉక్కడగించెను... నాటి ముక్కంటి చూపు
కాలిన మదనుని మేలుకొలిపెను... నేటి నీ కొంటె చూపు
సగము మేనిలో మగువను నిలిపిన..
సగము మేనిలో మగువను నిలిపిన... చంద్రధరుడు ఆ హరుడు
తనువు తనువె ఈ తరణి కొసంగిన... రసిక వరుడు.. ఈ హరుడు.. శివ.. శివ
శివ శివ అననేలరా
కౌగిలిలోనే కైలాస మందగా..
కౌగిలిలో నే కైలాస మీయగా
శివ శివ అననేలరా .. రా.. రా.. రా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4016
No comments:
Post a Comment