Tuesday, December 9, 2014

ఒక్కరిద్దరుగ మారేది

చిత్రం :  ఆలుమగలు (1977)
సంగీతం :  టి.చలపతిరావు
నేపధ్య గానం :  రామకృష్ణ , సుశీల 



పల్లవి :


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగురవ్వాలనీ
అవ్వాలనీ.. అవ్వాలనీ


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగురవ్వాలనీ
అవ్వాలనీ.. అవ్వాలనీ



చరణం 1 :


కడలి పొంగులన్నీ..  నీ కదలికలో ఉన్నవి
పడగెత్తే పరువాలే..  నీ పైట దాగున్నవీ


నీ నవ్వుల పువ్వులలో..  నవవసంతమున్నదీ
నీ నవ్వుల పువ్వులలో..  నవవసంతమున్నదీ
నీ చూపులలోనే.. వలపూ పిలుపూ ఉన్నవీ 


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగురవ్వాలనీ
అవ్వాలనీ.. అవ్వాలనీ..



చరణం 2 :



నీ సొగసులు ఝుమ్మంటే.. నా ఊపిరి వేడెక్కింది
నే నిన్ను తాకగానే.. ఆ నీలిమబ్బు మెరిసింది
నీ జంటగ నేనుంటే..  నా మనసే ఊగింది
నీ జంటగ నేనుంటే..  నా మనసే ఊగింది
నీ కౌగిలిలోనా కలలే నిజమౌతున్నవీ


ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగురవ్వాలనీ
అవ్వాలనీ.. అవ్వాలనీ..


చరణం 3 :



మరుమల్లెల బాటలో నీ అడుగుల జాడలో
మడుగులొత్తనా ఎదను పరిచి ఈ వేళ
నీవునేను ఒకటైతే.. ఆకాశం అందింది
నీవునేను ఒకటైతే.. ఆకాశం అందింది
మన కోసం తానే చుక్కల ముగ్గులు వేసింది



ఒక్కరిద్దరుగ మారేది .. ఇద్దరు ఒకటవ్వాలని
ఇద్దరు ఒకటైపోయేది ముచ్చటగా.. ముగురవ్వాలనీ
అవ్వాలనీ.. అవ్వాలనీ..



No comments:

Post a Comment