Tuesday, December 9, 2014

కాపురం కొత్త కాపురం

చిత్రం :  కొత్త కాపురం (1975)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల, బాలు
 


పల్లవి :


కాపురం కొత్త కాపురం.. కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న..  అనురాగ గోపురం
కాపురం కొత్త కాపురం
ఆలుమగలు కట్టుకున్న..  అనురాగ గోపురం.. కాపురం కొత్త కాపురం



చరణం 1 :


పాకలో ఉన్నా అది పసిడి మేడగా.. మండుటెండలో ఉన్నా మల్లెల  నీడగా
పాకలో ఉన్నా అది పసిడి మేడగా..  మండుటెండలో ఉన్నా మల్లెల  నీడగా


ఉన్నంతలో చెప్పలేని తీపిని అందించేది
గోరంతలో కొండంత తృప్తిని కలిగించేది   


కాపురం కొత్త కాపురం .. ఆలుమగలు కట్టుకున్న..
అనురాగ గోపురం.. కాపురం కొత్త కాపురం 



చరణం 2 :



తన పతియే కనిపించే దైవమనీ.. తన సతియే ఫలియించిన పుణ్యమనీతన పతియే కనిపించే దైవమనీ..తన సతియే ఫలియించిన పుణ్యమనీ

ఒకరినొకరు తెలుసుకునీ.. ఒకటిగా నడచుకొనీ బ్రతుకంతా పచ్చదనం
బ్రతుకంతా పచ్చదనం.. అందించుకొనేదే.. కాపురం కొత్త కాపురం

     

చరణం 3 :



చీకటిలో చిరునవ్వులు వెలిగించుకొనీ.. బాధలలో అనందం పంచుకొనీచీకటిలో చిరునవ్వులు వెలిగించుకొనీ.. బాధలలో అనందం పంచుకొనీకలిమిలో పొంగక.. లేమిలో క్రుంగక 

వెలుగునీడ లొక్కటిగా కలబోసి చూసేదే.. 


కాపురం కొత్త కాపురం.. ఆలుమగలు కట్టుకున్న..
అనురాగ గోపురం.. కాపురం కొత్త కాపురం






No comments:

Post a Comment