Sunday, January 11, 2015

ఏడుకొండల పైన ఏల వెలిశావో?

చిత్రం :  జ్యోతి (1976)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


ఏడుకొండలపైన ఏలవెలిశావో?... ఎవరికీ అందక ఎందుకున్నావో ?
ఏడుకొండలపైన ఏలవెలిశావో?..  ఎవరికీ అందక ఎందుకున్నావో? 



తెలియని వారికి తెలుపర స్వామి...
తెలియని వారికి తెలుపర స్వామి..  కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావు.. ఎవరికీ అందక ఎందుకున్నావో 


చరణం 1 :


ఆ ఆ ఆ.. ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు.. ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ
ఎక్కడో ఎవరికో ముడివేసి పెడతావు.. ఏ ముడిని ఎందుకో విడదీసి పోతావూ  


అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో.. అస్తవ్యస్తాలుగా కనిపించు నీ లీలలో
ఏ అర్థమున్నదో?..  ఏ సత్యమున్నదో?  


తెలియని వారికి తెలుపర స్వామి.. కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావో.. ఎవరికీ అందక ఎందుకున్నావో 



చరణం 2 :


పాపిష్టి ధనముకై ఆశపడుతున్నావో.. ఏనాటి ఋణమును తీర్చుకుంటున్నావో
రెండు ప్రేమల మధ్య బండగా  మారావూ.. స్వామి
రెండు ప్రేమల మధ్య బండగా మారావూ
రేపు లేని నీకు దోపిడీ ఎందుకో..  


తెలియని వారికి తెలుపర స్వామి.. కన్నుల పొరలను తొలగించవేమి
ఏడుకొండలపైన ఏలవెలిశావో.. ఎవరికీ అందక ఎందుకున్నావో  





No comments:

Post a Comment