Saturday, February 21, 2015

కోరికలే గుర్రాలయితే ( బాలు)

చిత్రం : కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు 

పల్లవి :

కోరికలే గుర్రాలయితే... ఊహలకే రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది.. బ్రతుకే శృతి తప్పుతుంది

చరణం 1 :

నేలవిడిచి సాము చేస్తే మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి
మేడం అర్థమయ్యిందా?

నేలవిడిచి సాము చేస్తే మూతిపళ్ళు రాలుతాయి
కళ్ళు నెత్తికొచ్చాయంటే కాళ్ళు కొట్టుకుంటాయి
గాలి కోటలు కట్టావు.. అవి కూలి తలపై పడ్డాయి
చివరి మెట్టుపై కెక్కావు చచ్చినట్టు దిగమన్నాయి

కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
మనిషికి మతి పోతుంది... బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది...  బ్రతుకే శృతి తప్పుతుంది

చరణం 2 :

పులిని చూసి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు
మై స్వీట్ డార్లింగ్

పులిని చూసి నక్కలాగ వేసుకొంటివి వాతలు
రాజు నెప్పుడో చూసి మొగుడికి పెట్టినావు వంకలు

అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
అప్పు చేసిన పప్పు కూడు అరగదమ్మా వంటికి
జుట్టు కొద్ది పెట్టిన కొప్పే అందం ఆడదానికి..

కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే
ఏమౌతుంది?
మనిషికి మతి పోతుంది... బ్రతుకే శృతి తప్పుతుంది
మనిషికి మతి పోతుంది... బ్రతుకే శృతి తప్పుతుంది

కోరికలే గుర్రాలయితే ఊహలకే అహహా.. రెక్కలు వస్తే..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4848

No comments:

Post a Comment