Tuesday, July 21, 2015

వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వొద్దు

చిత్రం :  దొరబాబు (1974)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల

పల్లవి :

వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వొద్దు.. అది తేనె కన్న తియ్యనని చెప్పొద్దు.. నాకు చెప్పొద్దూ

వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ.. దాని తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు... అడ్డు చెప్పొద్దూ 

చరణం 1 :

నా పెదవిపై పేరువుంది చదువుకో..  నా హృదయమందు రూపముంది చూసుకో

ఆ పేరు నాదని.. రూపు నాదని..  పేరు నాదని.. రూపు నాదని
నీ చెంప ఎరుపు చెప్పకే చెప్పింది..  ఒప్పుకోమంది     

వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వొద్దు.. అది తేనె కన్న తియ్యనని చెప్పొద్దు.. నాకు చెప్పొద్దూ

చరణం 2 :

గుప్పెడంత గుండెలోన గుట్టుందీ..  విప్పలేని చిక్కుముడే వేసిందీ

చిక్కుముడిని పంటనొక్కి విప్పుకోవచ్చు.. గుట్టులన్ని కళ్ళతోటి చెప్పుకోవచ్చు

వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ... దాని తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు.. అడ్డు చెప్పొద్దూ 

చరణం 3 :

పాట వింటు పరవశించి పోవద్దూ.. ఆట కట్టిపోవునని అనుకోవద్దూ

పాట పాడినా పరవశించినా . . పగబట్టిన నాగుబాము పడగ దించునా.. కాటు మానునా ?  

వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వొద్దు.. అది తేనె కన్న తియ్యనని చెప్పొద్దు.. నాకు చెప్పొద్దూ
వద్దు వద్దు వద్దు ముద్దు వద్దనవద్దూ... దాని తీపి ఎంతో తెలిసికోక ఆపొద్దు.. అడ్డు చెప్పొద్దూ  

No comments:

Post a Comment