Monday, July 20, 2015

రామచిలకా పెళ్ళికొడుకెవరే

చిత్రం :  రామచిలక (1978)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


రామచిలకా పెళ్ళికొడుకెవరే??
మాఘమాసం మళ్ళీరాదు..
మనువాడే పెళ్ళికొడుకెవరే??


రామచిలకా పెళ్ళికొడుకెవరే??
మాఘమాసం మళ్ళీరాదు..
మనువాడే పెళ్ళికొడుకెవరే??



చరణం 1 :


ఏరులాంటి వలపు..ఎల్లువైన వగపు..
ఎన్నెలంతా ఏరుపాలై ఎదురీతేనా??
ఏరులాంటి వలపు..ఎల్లువైన వగపు..
ఎన్నెలంతా ఏరుపాలై ఎదురీతేనా??


తుమ్మెదెవరో..
తుమ్మెదెవరో రాక ముందే..తుళ్ళిపడిన కన్నె గువ్వ
ఈడు కోరే తోడు లేక కుములుతున్న ప్రేమమొలకా!!


రామచిలకా పెళ్ళికొడుకెవరే??
మాఘమాసం మళ్ళీరాదు..
మనువాడే పెళ్ళికొడుకెవరే??


చరణం 2 :


గొంతులోని పిలుపు..గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా??
గొంతులోని పిలుపు..గుండెలోని వలపు
తీగ తెగిన రాగమల్లే మూగబోయెనా??


గోరువంకా..
గోరువంకా దారివంక ఎన్నెలంతా తెల్లవారే..
పూతలోనే రాలిపోయే..పులకరింత ఎందుకింక??


రామచిలకా పెళ్ళికొడుకెవరే??
మాఘమాసం మళ్ళీరాదు..
మనువాడే పెళ్ళికొడుకెవరే??


రామచిలకా పెళ్ళికొడుకెవరే??
రామచిలకా పెళ్ళికొడుకెవరే??



No comments:

Post a Comment