Monday, July 20, 2015

నీవే అమరస్వరమే

చిత్రం: ఘర్షణ (1988)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: బాలు, చిత్ర 


పల్లవి :


నీవే అమరస్వరమే.. సాగే శృతిని నేనే
నీ మనసు నీ మమత.. వెలిసేనే నా కోసం
నీలో సర్వం నా సొంతం


నీవే అమరస్వరమే... సాగే శృతిని నేనే


చరణం 1 :

పలికే నీ అధరాలు.. చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం.. కురిసే ఊహల గంధం
మల్లెపూల బంధమీవు ఓ చెలి


అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగ బంధనం అనురాగ చందనం 

నా ధ్యాసలు నీవే... నీ బాసలు నేనే
నా ఊహలు నీవే... నీ ఊపిరి నేనే

నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే.. సాగే శృతిని నేనే


చరణం 2 : 


మెరిసే వన్నెల లోకం... చిందే చల్లని గానం
తియ్యనైన ఆశలన్ని నీ వరం
తరగని చెరగని కావ్యం... ఊహలకిది అనుబంధం
భావరాగ భాష్యమే ఈ జీవితం


పలకరించు చూపులు... పాటపాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే
పలకరించు చూపులు... పాటపాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే 


నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోన నిండాలి నేనే
నీలో సర్వం నా సొంతం


నీవే అమరస్వరమే... సాగే శృతిని నేనే
నీ మనసు నీ మమత... వెలిసేలే నీ కోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే... సాగే శృతిని నేనే 





https://www.youtube.com/watch?v=K6KdSMp-OD8

No comments:

Post a Comment