Thursday, July 23, 2015

మనసంతా ప్రేమ కళా



చిత్రం  :  జైలు పక్షి (1986)
సంగీతం  :   కె.వి. మహదేవన్
గీతరచయిత  :  వేటూరి
నేపధ్య గానం  : బాలు, సుశీల  


పల్లవి :

మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్ర కళా
ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ.. 


మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్రకళా
అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. తళతళ..  కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ..  కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా



చరణం 1 :


మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ
మనసులు గుసగుసలాడితే.. అది మౌన కళ
తలపులు స్వరములు పాడితే.. అది గాన కళ 


నడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ
నడుములో మెరుపులాడితే.. అది నాట్య కళ 


కళ్ళలో కవితలల్లితే.. అది కావ్య కళ



ఇన్నాళ్లు కాపురమున్నా.. ఇంకా ఉంది పెళ్ళి కళ
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ.. కళకళ.. తళతళ..
మనసంతా ప్రేమ కళా.. 


చరణం 2 :


చంపను చిటుకున మీటితే... అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ
చంపను చిటుకున మీటితే... అది చిలిపి కళ
పెదవిని పెదవికి అద్దితే.. అది మదన కళ 


నిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
నిదురలో నవ్వులొలికితే.. అది జీవ కళ
ఒకరిలో ఒకరు ఒదిగితే.. అది యోగ కళ.. సమ్యోగ కళ



అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. తళతళ..  కళకళ.. తళతళ..
కళకళ.. తళతళ..  కళకళ.. తళతళ..  




మనసంతా ప్రేమ కళా... తనువంతా చంద్ర కళా
అనురాగం ఆలూమగలకు.. అన్నిటి కన్నా ఆది కళ
కళకళ.. హా.. తళతళ.. హా.. కళకళ.. హా..తళతళ.. హా..
కళకళ.. హా.. తళతళ.. హా.. కళకళ.. హా..తళతళ.. హా..
మనసంతా ప్రేమ కళా.. 





No comments:

Post a Comment