Monday, August 3, 2015

ఎదుటే ఒక అందం




చిత్రం : పండంటి జీవితం (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు



పల్లవి :


ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం

ఏల ఈ పంతం... బాలా నా సొంతం.. వలపు వసంతం..
విరిసే ఈ వేళలో.. పిలిచే రాగాలలో

ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం



చరణం 1 :


అలకలు రేపిన పులకలు చూడు
వలపుల తీయని పిలిపులు చూడు
అలకలు రేపిన పులకలు చూడు
వలపుల తీయని పిలిపులు చూడు

దాగని నవ్వులు దాచకులే...
సాగిన ఈ రథమాగదులే
నీ బెట్టులెందుకు చెల్లవులే...

చిరునవ్వో.. అరనవ్వో.. నవ్వాలిలే.. హా..
చిరునవ్వో.. అరనవ్వో.. నవ్వాలిలే


ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం 

ఏల ఈ పంతం... బాలా నా సొంతం.. వలపు వసంతం..
విరిసే ఈ వేళలో.. పిలిచే రాగాలలో

ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం



చరణం 2:


హంసకు నడకలు నేర్పినదానా...
నెమలికి నటనలు తెలిపినదానా...
హంసకు నడకలు నేర్పినదానా...
నెమలికి నటనలు తెలిపినదానా...


ఒంటరితనమిక సాగదులే.. తుంటరి చూపులు సోకునులే..
నీ పైట రెపరెపమన్నదిలే.. ఆపైన ఏమైనా అడగకులే.. ఆపైన ఏమైనా అడగకులే


ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం
ఎదుటే ఒక అందం.. ఎదిగే అనుబంధం 

ఏల ఈ పంతం... బాలా నా సొంతం.. వలపు వసంతం..
విరిసే ఈ వేళలో.. పిలిచే రాగాలలో

లలలా..లలలాలా.. లలలా..లలలాలా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2156

No comments:

Post a Comment