Monday, August 3, 2015

కోటికి ఒకరే పుడతారు

చిత్రం : మనిషి రోడ్డున పడ్డాడు (1974)

సంగీతం :  శంకర్‌-గణేష్

గీతరచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం : బాలు



పల్లవి:


కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ
పుణ్యమూర్తులూ.. సూర్యచంద్రులూ


కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారికొరకే వస్తారు సూర్యచంద్రులు


చరణం 1:


నా స్వార్ధం నాదే నని తలపోసేవాడూ.. నలుగురికి భారమై కాటికి పోతాడు
నా దేశం నా మనిషి అని పోరాడేవాడు.. పోయినా లోకాన మిగిలిపోతాడు
లోకాన మిగిలిపోతాడు.....


కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు
వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు




చరణం 2 :


అల్లా..ఓ అగ్బర్..అల్లా..ఓ అగ్బర్..అల్లా..
కులమత భేధాలెందుకు మనిషిలో.. కనిపించవు చివరకు ఏ పశువులో
బ్రతుకులోని తీయదనం మమతలో.. మనిషిలోని గొప్పదనం నడతలో



చరణం 3 :

తలరాతలు నమ్ముకునే దైన్యం పోవాలి...
తన చేతలపై మనిషికి ధైర్యం రావాలి...
చీకటినే నిందించే నైజం విడవాలి..
పదుగురికి దీపమై తానే వెలగాలి.. దీపమై తానే వెలగాలి...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7224

No comments:

Post a Comment