Tuesday, August 25, 2015

మౌనమె నీ భాష






చిత్రం : గుప్పెడు మనసు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాల మురళీకృష్ణ




పల్లవి :


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా
మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా







చరణం 1 :



చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
చీకటి గుహ నీవు... చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా... తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో... ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో... యేమై మిగిలేవో  
   


మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా

తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా


చరణం 2 :



కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా... మాయల దెయ్యానివే
లేనిది కోరేవు.. ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు



మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా

తలపులు ఎన్నెన్నొ కలలుగ కంటావు

కల్లలు కాగానే కన్నీరౌతావు

మౌనమె నీ భాష...  ఓ మూగ మనసా..  ఓ మూగ మనసా





5 comments: