Tuesday, August 4, 2015

మందారమల్లికి శృంగార పూజలు

చిత్రం :  మల్లెమొగ్గలు  (1986)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి  

పల్లవి :

మందారమల్లికి శృంగార పూజలు.. ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
ఆ..ఆ...ఆ..ఆ..
మందారమల్లికి శృంగార పూజలు.. ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. కౌగిళ్లల్లో  నీ రాణివాసాలు  

మనసైనా స్వామీకి మందార మాలలు.. మరుమల్లె వేళకి సిరిమల్లే డోళలు
ఆ..ఆ..ఆ...ఆ...ఆ..
మనసైనా స్వామీకి మందార మాలలు.. మరుమల్లె వేళకి సిరిమల్లే డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. కౌగిళ్లతోనే పూలహారాలు   

చరణం 1 :

పుప్పొడి నలుగులు పెట్టనా.. పుత్తడి జిలిగులు చూడనా

గంగా యమునా సరస్వతులతో.. కృష్ణవేణి నీ జడలల్లనా

వెన్నెల కలువల మెత్తమరించి
వెన్నెల కలువల మెత్తమరించి... కిన్నెరవీణలు మీటనా
   
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస  

మనసైనా స్వామీకి మందార మాలలు.. మరుమల్లె వేళకి సిరిమల్లే డోళలు 

చరణం 2 :

పిల్లనగ్రోవిని ఊదనా.. పిల్లని గోపిక చేయనా

వచ్చీరానీ అష్టపదులతో... రాసలీలలే ఆడేయ్యనా
 
కన్నులవలపులు కౌగిలికిచ్చి...
కన్నులవలపులు కౌగిలికిచ్చి...
వెన్నెల తలుపులు వేయనా... 

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస  

మందారమల్లికి శృంగార పూజలు.. ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. కౌగిళ్లల్లో  నీ రాణివాసాలు  

మనసైనా స్వామీకి మందార మాలలు.. మరుమల్లె వేళకి సిరిమల్లే డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. కౌగిళ్లతోనే పూలహారాలు 

మందారమల్లికి శృంగార పూజలు.. ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12031

No comments:

Post a Comment