Thursday, September 3, 2015

గలగల పారుతున్న గోదారిలా

చిత్రం :  గౌరి (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు




పల్లవి :



గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 



చరణం 1 :


అందాల పందిరి వేసే ఈ తోటలూ.. ఆనింగి అంచులు చేరే ఆ బాటలూ
నాగలి పట్టే రైతులూ..  కడవలు మోసే కన్నెలూ
బంగరు పంటల సీమలూ.. చూడరా..  హే..  

         

గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 



చరణం 2 :


దేశానికాయువు పోసే ఈ పల్లెలూ.. చల్లంగ ఉండిననాడే సౌభాగ్యమూ
సత్యం ధర్మం నిలుపుటే.. న్యాయం కోసం పోరుటే
పేదల సేవలు చేయుటే..  జీవితం.. హే.. 



గలగల పారుతున్న గోదారిలా
రెపరెపలాడుతున్న తెరచాపలా
ఈ చల్లనీ గాలిలా.. ఆ పచ్చనీ పైరులా
ఈ జీవితం సాగనీ.. హాయిగా..  హే..
గలగల పారుతున్న గోదారిలా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3073

No comments:

Post a Comment