Wednesday, September 30, 2015

నీ మదిలో నేనే ఉంటే

 చిత్రం :  జగమే మాయ (1973)

సంగీతం :  సత్యం

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం :  బాలు, సుజాత



పల్లవి :


నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే

నా ఒడిలో నీవే ఉంటే.. ఉంటే

నీ మదిలో నేనే ఉంటే . . నా ఒడిలో నీవే ఉంటే

గుండెల్లో వలపుల మల్లి.. గుబాళించిపోదా


నీ మదిలో నేనే ఉంటే..  నా ఒడిలో నీవే ఉంటే

బ్రతుకంతా తీయని తలపుల బంతులాట కాదా

నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే.. ఉంటే

 


చరణం 1 :


అటు పచ్చని పచ్చిక ఉంటే..  ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే

అటు పచ్చని పచ్చిక ఉంటే.. ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే

కౌగిలిలో కన్నెవయసే.. కాగి కాగి వేగిపోతుంటే . . ఉంటే

ప్రతి నిమిషం భలే రుచి కాదా . . ప్రతి నిమిషం భలే రుచి కాదా  



నీ మదిలో నేనే... ఉంటే

నా ఒడిలో నీవే...  ఉంటే

గుండెల్లో వలపుల మల్లి.. గుబాళించిపోదా

నీ మదిలో నేనే ఉంటే . . ఉంటే..  ఉంటే



చరణం 2 :


కొండవాగు దూకుతుంటే.. కొంటె కోర్కె రేపుతుంటే

కొండవాగు దూకుతుంటే.. కొంటె కోర్కె రేపుతుంటే

ఇద్దరమూ తరగల మాటున నురగల చాటున ఏకమౌతుంటే . . ఉంటే . .

ప్రతి నిమిషం మరో రుచి కాదా...  ప్రతి నిమిషం మరో రుచి కాదా


నీ మదిలో నేనే...  ఉంటే.. 

నా ఒడిలో నీవే...  ఉంటే
బ్రతుకంతా తీయని తలపుల బంతులాట కాదా
నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5300

No comments:

Post a Comment