Thursday, September 24, 2015

ఈ కుంకుమతో.. ఈ గాజులతో

 

 

 

చిత్రం :  పల్నాటి సింహం (1985)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఈ కుంకుమతో.. ఈ గాజులతో.. కడతేరిపోనీ స్వామీ..

కనుమూయనీ నన్ను స్వామీ...

ఓ...చెన్నకేశవా.. పసుపు కుంకుమ

జంట కలిశాయి దీవించరా... జంట కలిశాయి దీవించరా...

 


చరణం 1 :


పల్నాటి సీమంతా పండు మిరప చేలు

పసుపు కుంకాలిచ్చి సీమంతాలాడేను

మాంచాల మాదేవి మాంగళ్యం మాదేను

పేదైన మగసిరుల పేరంటాలాడేను

పౌరుషమున్న బ్రతుకులలోన పాశం కన్నా దేశం మిన్న

బ్రతికే ఉన్నా చితిలో ఉన్నా అశువులకన్నా పసుపే మిన్న

పచ్చని సీమ పల్నాడంతా వైకుంఠమై వెలిగే వేళ

 

ఈ కుంకుమతో... ఈ గాజులతో... కడతేరిపోనీ స్వామీ..

 


చరణం 2 :


ఏడడుగులు నడిచాను ఏనాడో మీ తోడు

ఏడేడు జన్మలకి అవుతాను మీతోడు

జననాలు మరణాలు కాలేవు ఎడబాటు

నిండు ముత్తైదువుగా ఎదురొచ్చి దీవించు

ఆలిగా నేను అంతిమ జ్వాల హారతి పడితే అంతే చాలు

జ్వాలలు కూడా పావనమయ్యే జ్యోతివి నువ్వు జోతలు నీకు

మళ్ళీ జన్మ మనకే ఉంటే పల్నాటిలోనే పుడుదామంట


ఈ కుంకుమతో... ఈ గాజులతో... కడతేరిపోనీ స్వామీ..

కనుమూయనీ నన్ను స్వామీ...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3792

No comments:

Post a Comment