Tuesday, September 29, 2015

సందమామ కంచమెట్టి





చిత్రం :  రాంబంటు (1996)


సంగీతం  :  కీరవాణి


గీతరచయిత :   వేటూరి


నేపధ్య గానం  :  చిత్ర, బాలు




పల్లవి :


సందమామ కంచమెట్టి.. సన్నజాజి బువ్వపెట్టి

సందెమసక చీరగట్టి.. సందు చూసి కన్నుగొట్టి

సిగపూవు తెమ్మంటె మగరాయుడు.. అరటిపువ్వు తెస్తాడు అడవిపురుషుడు

 

సందమామ కంచమెట్టి.. సన్నజాజి బువ్వపెట్టి
సందెమసక చీరగట్టి.. సందు చూసి కన్నుగొట్టి





భద్రాద్రిరామయ్య పెళ్ళికొడుకవ్వాల

సీతలాంటినిన్ను మనువాడు కోవాల

బెజవాడ కనకదుర్గమ్మ బాసికాల్దేవాల

బాసరలో సరస్వతి పసుపుకుంకుమలివ్వాల



చరణం 1 :


విన్నపాలు వినమంటే విసుగంటాడు...  మురిపాల విందంటే ముసుగెడతాడు

విన్నపాలు వినమంటే విసుగంటాడు...  మురిపాల విందంటే ముసుగెడతాడు

బుగ్గపండు కొరకడు... పక్కపాలు అడగడు

పలకడూ...  ఉలకడూ... పంచదార చిలకడు

కౌగిలింతలిమ్మంటే కరుణించడు... ఆవులింతలంటాడు అవకతవకడు

ఏడుకొండలసామి ఏదాలుజదవాల

సెవిటిమల్లన్నేమో సన్నాయి ఊదాల

అన్నవరం సత్తన్న అన్నవరాలివ్వాల

సింహాద్రప్పన్న సిరిజాసలివ్వాల

 


చరణం 2 :


పెదవి తేనెలందిస్తే పెడమోములు... తెల్లారిపోతున్న చెలినోములు

పెదవి తేనెలందిస్తే పెడమోములు... తెల్లారిపోతున్న చెలినోములు
పిల్లసిగ్గు చచ్చినా... మల్లెమొగ్గ విచ్చినా
కదలడూ... మెదలడూ... కలికి పురుషుడు
అందమంత నీదంటే అవతారుడు... అదిరదిరి పడతాడు ముదురుబెండడూ



No comments:

Post a Comment