Wednesday, September 2, 2015

నేనూ నా దేశం

చిత్రం :  నేనూ నా దేశ౦ (1973)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  అంకిశ్రీ
నేపధ్య గానం :  బాలు, సుశీల




పల్లవి :



నేనూ నా దేశం.. పవిత్ర భారత దేశం
సాటి లేనిదీ.. దీటు రానిదీ.. శాంతికి నిలయం మన దేశం
నేనూ నా దేశం.. పవిత్ర భారత దేశం
సాటి లేనిదీ.. దీటు రానిదీ.. శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం.. పవిత్ర భారత దేశం... ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ



చరణం 1 :



అశోకుడేలిన ధర్మ ప్రదేశం.. బుద్ధుడు వెలసిన శాంతి దేశం
బుద్ధం శరణం గఛ్చా మీ.. ధర్మం శరణం గఛ్చా మీ..  సంఘం శరణం గచ్చామీ
అశోకుడేలిన ధర్మ ప్రదేశం.. బుద్ధుడు వెలసిన శాంతి దేశం


కులమత భేధం మాపిన త్యాగీ అమర బాపూజీ వెలసిన దేశం
వందేమాతరం.. వందేమాతరం.. వందేమాతరం
కులమత భేధం మాపిన త్యాగీ.. అమర బాపూజీ వెలసిన దేశం


నేనూ నా దేశం పవిత్ర భారత దేశం 



చరణం 2 :



కదం తొక్కిన వీర శివాజీ.. వీర శివాజీ
వీర విహారిని.. ఝాన్సీరాణీ..  ఝాన్సీరాణీ
స్వరాజ్య సమరుడు అల నేతాజీ... జైహింద్ జైహింద్ జైహింద్
స్వరాజ్య సమరుడు అల నేతాజీ... కట్ట బ్రహ్మణ పుట్టినదేశం

నేనూ నా దేశం... పవిత్ర భారత దేశం.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ



చరణం 3 :


అజాదు.. గోఖలే.. వల్లభ.. పటేలు.. లజపతి.. తిలక్.. నౌరోజీలు
అజాదు.. గోఖలే.. వల్లభ.. పటేలు.. లజపతి.. తిలక్.. నౌరోజీలు
అంబులు కురిపిన మన అల్లూరీ.. అంబులు కురిపిన మన అల్లూరీ
భగత్ రక్తమూ చిందిన దేశం.. హిందుస్తాన్ హమారాహై
హిందుస్తాన్ హమారాహై.. హిందుస్తాన్ హమారాహై 

నేనూ నా దేశం...  పవిత్ర భారత దేశం 



చరణం 4 :


గుండ్ల తుపాకీ చూపిన దొరలకు..
గుండె చూపే.. మన ఆంధ్రకేసరి . . మన ఆంధ్రకేసరి
శాంతి దూత మన జవహర్ నెహ్రూ.. శాంతీ.. శాంతీ.. శాంతీ
శాంతి దూత మన జవహర్ నెహ్రూ .. లాల్ బహదూరు జన్మదేశం
జై జవాన్ జై కిసాన్.. జై జవాన్..
 

నేనూ నా దేశం...  పవిత్ర భారత దేశం 



చరణం 5 :


అదిగో.. స్వరాజ్య రథాన సారథీ
అదిగో..  స్వరాజ్య రథాన సారథీ.. స్వరాజ్య రథాన సారథీ
ఆదర్శ నారీ.. ఇందిర గాంధీ
గరీబీ హఠావో.. గరీబీ హఠావో.. గరీబీ హఠావో
ఆదర్శ నారీ ... ఇందిర గాంధీ
అడుగు జాడలో పయనిస్తాం.. అఖండ విజయం సాధిస్తాం
అడుగు జాడలో పయనిస్తాం.. అఖండ విజయం సాధిస్తాం


నేనూ నా దేశం... పవిత్ర భారత దేశం..
సాటి లేనిదీ దీటు రానిదీ.. శాంతికి నిలయం మనదేశం
నేనూ నా దేశం... నేనూ నా దేశం
నేనూ నా దేశం... నేనూ నా దేశం





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4603

No comments:

Post a Comment