Wednesday, September 2, 2015

కురిసెను హృదయములో తేనె జల్లులూ

చిత్రం :  నేనూ నా దేశ౦ (1973)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  అంకిశ్రీ
నేపధ్య గానం :  ఏసుదాసు, సుశీల




పల్లవి :



కురిసెను హృదయములో తేనె జల్లులూ.. విరిసెను నాలోనే ప్రేమ మల్లెలూ
కురిసెను కన్నులలో పూలమాలలూ..  విరిసెను నాలోనే ప్రేమ మాలలూ
కురిసెను హృదయములో తేనె జల్లులూ.. విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 



చరణం 1 :


పగలే వెన్నెల మయమూ.. ఈ జగమే నందన వనమూ
నా తలపులు పండే.. వలపులు నిండే మోజులు రేపె నాలో


మనసే ప్రేమాలయమూ.. అతి సుందర బృందావనమూ
తొలి చూపుల ననుమూ.. కలిసిన మనమూ.. ఆశలు రేపె నాలో... ఓ ప్రియా ఆ ఆ ఆ ఆ


కురిసెను హృదయములో తేనె జల్లులూ... విరిసెను నాలోనే ప్రేమ మాలలూ 


చరణం 2 :



పెదవులలో మధురిమలూ.. నీ నడకలలో మగసిరులూ
అనురాగములొలికే తీయని పలుకే విందులు చేసె నాలో


కన్నులలో నయగారం.. నీ నడకలలో వయ్యారం
ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే తొందర చేసె నాలో..  ఓ చెలీ...  


కురిసెను కన్నులలో పూలమాలలూ..  విరిసెను నాలోనే ప్రేమ మల్లెలూ 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4602

No comments:

Post a Comment