Saturday, October 3, 2015

ఆనంద మానందమాయెనే

చిత్రం :  సావాసగాళ్లు (1977)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి : 

ఆ... ఆ.. ఆనంద మానందమాయెనే.. అందాల బొమ్మకు సిగ్గాయెనే
ఆ.. ఆ.. ఆనంద మానందమాయెనే.. ఆ సిగ్గు నీకెంతో ముద్దాయెనే
ఆ... ఆ.. ఆనంద మానందమాయెనే.. అందాల బొమ్మకు సిగ్గాయెనే 

చరణం 1 :

ఆకులు రాలే కాలంలో చిగురులు వేయుట చూచానే
ఆకులు రాలే కాలంలో చిగురులు వేయుట చూచానే
ఆశ నిరాశైపోయే వేళకు అందెలమెవరో తెచ్చారే

కొయ్య బొమ్మలు చేసేవాడికి కుందనం ఎవరో ఇచ్చారే
ఆ కుందనానికి గుండెను పొదిగి కోరికెలెవరో రేపారే
కోరికెలెవరో రేపారే

ఆ... ఆ.. ఆనంద మానందమాయెనే.. అందాల బొమ్మకు సిగ్గాయెనే
ఆ.. ఆ.. ఆనంద మానందమాయెనే.. ఆ సిగ్గు నీకెంతో ముద్దాయెనే

చరణం 2 : 

వెచ్చవెచ్చని కౌగిలింతకు కమ్మదనమూ వచ్చేనే
కమ్మకమ్మని కలలూ నేడు కాళ్లు వచ్చీ నడిచేనే

వెచ్చవెచ్చని కౌగిలింతకు కమ్మదనమూ వచ్చేనే
కమ్మకమ్మని కలలూ నేడు కాళ్లు వచ్చీ నడిచేనే

కాళ్లు నాలుగు కలిసినపుడు కాలమాగిపోవునే
కాళ్లు నాలుగు కలిసినపుడు కాలమాగిపోవునే
ఆగిపోయిన కాలమునకు అక్కసెంతో చెప్పలేనే... అక్కసెంతో చెప్పలేనే

ఆ... ఆ.. ఆనంద మానందమాయెనే..
అందాల బొమ్మకు సిగ్గాయెనే
ఆ.. ఆ.. ఆనంద మానందమాయెనే..
ఆ సిగ్గు నీకెంతో ముద్దాయెనే.. ఆ సిగ్గు నీకెంతో ముద్దాయెనే

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3654

No comments:

Post a Comment