చిత్రం: మండే గుండెలు (1979)
గీతరచయిత: ఆచార్యా ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల
సంగీతం: కె.వి. మహదేవన్
పల్లవి :
చల్లా చల్లని చందమామా.. ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా

అత్తమీద కోపం దుత్తమీద చూపేది.. అన్యాయం అన్యాయం చల్లారమ్మా

దపా దపా దపదపదప... దపా దపా దపదపదప
చరణం 1 :
దిబ్బరొట్టె ఉన్నాదీ తినుకోనూ... చేప పులుసు వున్నాది నంజుకోనూ

తిని చూడు ఒకసారి రవ్వంతా... దెబ్బకు దిగుతుంది వేడంతా...

దిగకుంటె నీ మీద ఒట్టేనూ.. తినకుంటే నేనీడే చస్తానూ
దిగకుంటె నీమీద ఒట్టేనూ.. తినకుంటే నేనీడే చస్తానూ
దపా దపా దపదపదప... దపా దపా దపదపదప
అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి ఉన్నాను ఊర్కోవమ్మా
అత్తమీద కోపం చూపెందుకు నాకు దుత్తల్లే నీవే దొరికావమ్మా

భామా భామా భామా భామా భామా
అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి ఉన్నాను ఊర్కోవమ్మా
చరణం 2 :
దిబ్బరొట్టెకన్నా నీ బుగ్గలున్నవి... చేప పులుసు కన్నా నీ పెదవులున్నవి

రెండిట్లో చల్లార్చే గుణమున్నదీ... ఊర్కొంటే ఉసిగొలిపే దుడుకున్నది

చవిచూడమంటావ రవ్వంతా... నెమరేసుకొంటావు రాత్రంతా

దపా దపా దపదపదప... పదా పదా పదపదపద
చల్లా చల్లని చందమామా.. ఇలా వేడెక్కిపోతే ఎల్లాగమ్మా
అల్లరల్లరి సత్యభామా... అసలే వేడెక్కి ఉన్నాను ఊర్కోవమ్మా
అత్తమీద కోపం దుత్తమీద చూపేది... అన్యాయం అన్యాయం చల్లారమ్మా
అత్తమీద కోపం చూపెందుకు నాకు దుత్తల్లే నీవే దొరికావమ్మా
దపా దపా దపదపదప
భామా భామా భమ భమ భమ
లా..లా లాలా లలలలా
లా లలలలాలలల్లలల్లా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=21011
No comments:
Post a Comment