Tuesday, November 17, 2015

జోహారు శిఖిపించమౌళి..






చిత్రం  :  శ్రీకృష్ణ విజయం (1970)


సంగీతం  : 
పెండ్యాల

గీతరచయిత  :  సినారె

నేపధ్య గానం  :   సుశీల    



పల్లవి :



జోహారు శిఖిపించమౌళి..
ఇదే .. జోహారు శిఖిపించమౌళి..
ఇదే .. జోహారు రసరమ్య గుణశాలి... వనమాలి
జోహారు శిఖిపించమౌళి..  



అనుపల్లవి :



కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి
కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే అరులను జడిపించి

నయగార మొకకంట.. జయవీర మొకకంట..
నయగార మొకకంట.. జయవీర మొకకంట..
చిలకరించి చెలువుమించి.. నిలిచిన శ్రీకర నరవర.. సిరిదొర


జోహారు శిఖిపించమౌళి..  



చరణం 1 :


నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు

నిగమాలకే నీవు సిగబంతివైనావు... అ... అఅ... అ... అ
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నెరసిన అవతారమూర్తి... ఘనసార కీర్తి 



జోహారు శిఖిపించమౌళి..  



చరణం 2 :



చకిత చకిత హరిణేక్షణా వదన చంద్రాకాంతు లివిగో
చలిత లలిత రమణీ చేలాంచల చామరమ్ము లివిగో
ఝళం ఝళిత సురలలనా నూపుర కలరవమ్ము లివిగో
మధు కర రవమ్ములివిగో ...  మంగళ రవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు
సుదూర నందన సుమమ్ము లివిగో 



జోహారు శిఖిపించమౌళి..  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=178


No comments:

Post a Comment