Sunday, November 1, 2015

పని చేసే రైతన్నా

చిత్రం :  పాడిపంటలు (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  బాలు

పల్లవి : 

పని చేసే రైతన్నా.. పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌

పని చేసే రైతన్నా..  పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌

చరణం 1 :

చేతి నిండ పని ఉంది.. చేతుల్లో బలం ఉంది
చేతి నిండ పని ఉంది.. చేతుల్లో బలం ఉంది
కొండల్నే పిండిచేసి వరదలకూ కరువులకూ ఆనకట్ట కట్టేద్దాం
జలాలతో పొలాలనే పండిద్దాం.. పండిద్దాం
జనాలలో ఆనందం నిండిద్దాం.. నిండిద్దాం   

పని చేసే రైతన్నా.. పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌.. మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌

చరణం 2 :

నేల మనది.. నింగి మనది.. గాలి.. నీరు.. వెలుగు మనవి
నేల మనది.. నింగి మనది.. గాలి.. నీరు.. వెలుగు మనవి
అదును చూసి.. పదును చేసి అన్నిటిని అదుపు జేసి
అదును చూసి.. పదును చేసి అన్నిటిని అదుపు జేసి
మనదారికి మళ్ళిద్దాం తరుగులేని సంపదలే కురిపిద్దాం.. కురిపిద్దాం
చెరిగిపోని చరిత్రనే సృష్టిద్దాం.. సృష్టిద్దాం     

పని చేసే రైతన్నా..  పాటుబడే కూలన్నా
రండోయ్‌ రారండోయ్‌..  మన కలలు పండే రోజొచ్చింది రారండోయ్‌.. రారండోయ్‌

No comments:

Post a Comment