Thursday, November 26, 2015

ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా

చిత్రం :  మంగళ తోరణాలు (1979)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, జానకి 



పల్లవి : 


ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత దూరమెందుకని
ఉదయమౌతున్నా.. 



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత అంత దూరం దేనికని
ఉదయమౌతున్నా..  ఆ.. ఆ..



చరణం 1 :


కనుల నిండా నీవే ఉంటే... కమ్మని నిదురకు చోటేది?
మనసు నిండా నీవే ఉంటే... తనువుకు నిలకడ ఎక్కడిది? 


నిట్టూర్పే ఆ తారకనడిగెను నీవాడు నిను చేర రాడెమని
బదులు పలికెను నా మూగ కన్నీరు.. అది నా జాబిలినడగమని



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత అంత దూరం దేనికని
ఉదయమౌతున్నా..  ఆ.. ఆ.. 



చరణం 2 : 



నిలిచిపోయేను గాలి పరుగు.. నీ అడుగుల సడి లేదేమని?
వెలవెలబోయెను కోయిల పిలుపు.. నీ పలుకే వినరాదేమని?



కోవెల గంటలు జాలిగ అడిగెను... నీ వాడు ఏవైపు రాడేమని?
బదులు పలికెను నా చేదు చిరునవ్వు.. అది ఆ దేవుణ్ణే అడగమని..



ఉదయమౌతున్నా.. సందెపడుతున్నా... హా..
కదలదు కాలం ఎందుకని
ఇంత చేరువగా మనముంటున్నా.. అంత దూరం దేనికని?
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..
ఉదయమౌతున్నా..   ఆ.. ఆ.. ఆ.. సందెపడుతున్నా... ఆ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4841


No comments:

Post a Comment