Tuesday, December 8, 2015

నల్లా నల్లని కళ్ళు








చిత్రం : కలియుగ రావణాసురుడు (1980)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


నల్లా నల్లని కళ్ళు... నవ్వీ నవ్వని కళ్ళు
చుసినట్టే చూసి.. తలుపులు మూసేసుకున్న కళ్ళు
నల్లా నల్లని కళ్ళు



చరణం 1 : 


తొలిపొద్దులో..ఓ.. ఓ..తామర..కళ్ళు..మ్మ్ మ్మ్ మ్మ్
మలిసందేలో..ఓ.. ఓ..కలువ కళ్ళు..అహహాహాహా
ఎటిపాయలో..ఓఓఓ..చేపకళ్ళు..ఊ
తోటమలుపులో..ఓ..లేడి కళ్ళు..మ్మ్
ఎన్నాళ్ళు చూసినా..ఆ..
ఎన్నేళ్ళు చూసినా..మ్మ్ మ్మ్ మ్మ్
లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు
ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు



చరణం 2 : 


సిగ్గును చీరగా కప్పుకుని..మ్మ్..
చిలిపిగా ఓరగా కప్పుకుని..మ్మ్ హు
చిరు చిరు నవ్వులు ..చుర చుర చూపులు
కలియబోసి..ఈఈఈ..ముగ్గులేసి..ఆ హా..
రారమ్మని..ఆహా..పోపొమ్మని..ఆహా..ఇపుడొద్దని .. సరిలెమ్మని
ఊరించే కళ్ళు..సరసాలకు శంఖం పూరించే కళ్ళు
ఏమి చక్కని కళ్ళు..రామ చక్కని కళ్ళు



చరణం 3 :


ఆవులించే కళ్ళు..మ్మ్..ఆకలేసిన కళ్ళు..మ్మ్
రైక తొడిగిన కళ్ళు.. పైట తొలగిన కళ్ళు..మ్మ్ హు
కసిరి వల విసిరి.. వలపు కొసరి కొసరి..ఆ ఆ ఆ
మగతను ఎగదోసే కళ్ళు.. మనసును నమిలేసే కళ్ళు
ఆ కళ్ళే..ఏ .. ఏ.. నడివేసవి వడగళ్ళు
ఆ కళ్ళే.. నా కలల పొదరిల్లు..మ్మ్ మ్మ్ మ్మ్



లోతులందని కళ్ళు.. నా లోకమేలే కళ్ళు..మ్మ్
ఏమి చక్కని కళ్ళు.. రామ చక్కని కళ్ళు




No comments:

Post a Comment